తనకు బాలకృష్ణకు ఎలాంటి గొడవలు లేవన్న నాగార్జున !
Published on Apr 9, 2017 10:31 am IST


సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మరోసారి తన హుందాతనాన్ని నిరూపించుకున్నారు. గత కొన్ని రోజులుగా తనపై, బాలకృష్ణపై వస్తున్న రూమర్లకు ఆయన తనదైన స్టైల్లో చెక్ పెట్టారు. నిన్న సాయంత్రం వైజాగ్లో జరిగిన టిఎస్సార్ – టీవి 9 అవార్డుల ప్రదానోత్సవంలో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన నాగార్జున ‘ఈ సభాముఖంగా ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. కొన్ని రోజులుగా నాకు, బాలయ్యకు గొడవలున్నాయని,మేమిద్దరం మాట్లాడుకోవడంలేదని వార్తలొస్తున్నాయి. అవన్నీ వట్టి పుకార్లు. మాకు ఎలాంటి గొడవలు లేవు’ అన్నారు. ఆ విషయాన్ని అంగీకరిస్తూ పక్కనే ఉన్న బాలయ్య నాగార్జునను ఆలింగనం చేసుకుని చేయి చేయి కలిపారు. ఈ సంఘటనతో ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న పెద్ద రూమర్ కు ఫులుస్టాప్ పడింది.

 
Like us on Facebook