టాలీవుడ్ కి పెద్ద రిలీఫ్
Published on Aug 12, 2017 7:14 pm IST


కొన్ని రోజుల క్రితం వరకు డ్రగ్స్ వివాదం, సినీప్రముఖులను సిట్ అధికారులు విచారించడం వంటి అంశాలతో టాలీవుడ్ మోతెక్కిపోయింది. పరిణామాలు ఎంత తీవ్రమవుతాయో అని అందరిలో ఉత్కంఠ నెలకొని ఉండేది. దీనిపై మిగిలిన టాలీవుడ్ ప్రముఖుల్లో కూడా అనేక భయాందోళనలు నెలకొని ఉన్నతరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రిలీఫ్ ఇచ్చారు. ఇండస్ట్రీ కి చెందిన వారిని ఇబ్బంది పెట్టమని గతంలో కేసీఆర్ అన్నారు. వారికి ఇబ్బంది కలగ కుండానే తెలంగాణాని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేస్తానని ఆయన తెలిపారు.

సిట్ విచారణలో ప్రధాన పాత్రపోషించిన పోలీస్ అధికారి అనూన్ సబర్వాల్ కూడా తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇకపై సినిమా స్టార్ల పై ఎంక్వరీ ఉండని ఆయన అన్నారు. ఈ వార్త టాలీవుడ్ కు గుడ్ న్యూస్ లాంటిదే. కానీ ఫోర్సినిక్ డిపార్ట్ మెంట్ నివేదిక ప్రకారం ఈ కేసులో ముందుకు వెళతామని సబర్వాల్ అన్నారు. ఆ నివేదికలోని వివరాల ఆధారంగా చార్జ్ షీట్ దాఖలు చేసి దానిని బట్టి విచారణ జరుగుతుందని తెలిపారు.

 
Like us on Facebook