రాజ్ తరుణ్ సినిమా ఇప్పట్లో లేనట్లే !

వరుస పరాజయాల నేపథ్యంలో ఇటీవల దిల్ రాజు బ్యానేర్ లో ఆలా ఎలా ఫెమ్ అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటించిన చిత్రం లవర్. ఇటీవల విడుదలైన ఈచిత్రం మొదటిరోజునుండే యావరేజ్ టాక్ ను తెచ్చుకోవడంతో సరైన ఓపెనింగ్స్ ను కూడా సాధించలేకపోయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయినా ఈ సినిమా ను గట్టెక్కిస్తాడనుకొని రాజ్ తరుణ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కానీ ఆయన కూడా ఏమిచేయలేక పోయాడు.

ఇక ఈ చిత్రం తరువాత మరో 3నెలల వరకు కొత్త చిత్రానికి సైన్ చేసేటట్టు కనబడడం లేదు ఈ యువ హీరో. ఈగ్యాప్ లోనైనా మంచి కథలను ఎన్నుకొని సినిమాలు చేస్తే తప్ప రాజ్ తరుణ్ కెరీర్ మళ్లీ గాడిలో పడదు.