సూర్య సినిమాకు ఫ్రమోషన్స్ ఎక్కడ ?

దేశంలో సమస్యలను ఈకల్లా పీకి పాడేయొచ్చు.. గుండెల్లో ధైర్యం.. చేతిలో ధర్మం ఉంటే మనం దేనికీ భయపడక్కర్లేదు’’ ఇది గ్యాంగ్ సినిమా ట్రైలర్ లో సూర్య చెప్పిన డైలాగ్. టిజర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఈ సినిమా కు సరైన పబ్లిసిటి జరగడం లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

విడుదలకు రెండు వారాలు మాతమే ఉన్నా ఈ సినిమాకు సంభందించి ప్రోమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తమిళ్ తో పటు తెలుగులో సూర్య కు మంచి మార్కెట్ ఉంది. మంచి అంచనాల మద్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చెయ్యబోతోంది.