ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్టే లేదు !

గతేడాది 2017 తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతగానో కలిసొచ్చింది. ‘బాహుబలి-2’ తో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్లను అందుకుంది ఇండస్ట్రీ. సంక్రాంతికి వచ్చిన చిరు ‘ఖైదీ నెం 150’ తో మొదలుకుని, ‘గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానంభవతి లు సంక్రాంతిని కలర్ ఫుల్ గా మార్చగా ఆ తర్వాత ‘ఫిదా, అర్జున్ రెడ్డి, నిన్ను కోరి, ఘాజి, జై లవ కుశ’ ఇలా ఎన్నో సినిమాలు ఘనవిజయాలుగా నిలిచాయి. కానీ ఈ ఏడాది జనవరి నెల సగం ముగుస్తున్నా ఇంకా ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు.

భారీ అంచనాలతో, పక్కాగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనుకున్న పవన్, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ టాక్ తో పరాజయం దిశగా వెళుతుండగా బాలయ్య ‘జై సింహ’ యావరేజ్ టాక్ తో కేవలం మాస్ ఆడియన్సుని మాత్రమే ఆకట్టుకుంటూ నడుస్తోంది.

ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన రెండు పెద్ద సినిమాల్లో ఏ ఒక్కటీ కూడా సంపూర్ణమైన ఆధిపత్యాన్ని చూపేలా లేకపోవడంతో కలెక్షన్ల వర్షం కురిపించగల సంక్రాంతి సీజన్ మొత్తం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించగల ఖచ్చితమైన సినిమాలు లేక వెలవెలబోయేలా కనిపిస్తోంది. పైగా ఈ నెలాఖరు వరకు చెప్పుకోదగిన సినిమాల విడుదల కూడా లేకపోవడం సినీ ప్రియులకు ఇంకొంత నిరుత్సాహాన్ని కలిగించే విషయం.