తెలుగులో చప్పుడు చేయని “భారతీయుడు 2”

తెలుగులో చప్పుడు చేయని “భారతీయుడు 2”

Published on Jul 4, 2024 2:03 PM IST


రీసెంట్ గానే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) థియేటర్స్ లోకి రాగ తన ఊహించని ప్రెజెన్స్ తో థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఇక ఈ చిత్రం తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లోనే తాను హీరోగా నటించిన లేటెస్ట్ మరో భారీ చిత్రం “భారతీయుడు 2” (Indian 2) థియేటర్స్ లోకి రాబోతుంది.

అయితే ఈ చిత్రం కోసం కమల్ అభిమానులు అటు తమిళ్ సహా తెలుగులో కూడా ఎదురు చూస్తుండగా ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే అంతా హిందీ, తమిళ్ భాషల సంబంధించే ప్రమోషన్స్ చేస్తున్నారు తప్పితే ఎక్కడా తెలుగు వెర్షన్ కి కనిపించడం లేదు.

కేవలం పాటలు, ట్రైలర్ వచ్చాయి తప్పితే తెలుగులో ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. అయితే తెలుగులో ఓ గ్రాండ్ ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. మరి ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. శంకర్ తన సినిమాలకి తెలుగులో కూడా గట్టిగానే ప్లాన్ లు చేస్తారు. మరి ఈ సినిమాకి ఇంకా ఎలాంటి ప్రోగ్రెస్ చూపించకపోవడం ఒకింత ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు