పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ హిట్ ‘దబాంగ్’కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు సుమారు 14 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మళ్ళీ చేతులు కలిపింది. తమిళ హీరో విజయ్ నటించిన ‘తేరి’ కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీ మార్పులతో ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండగా, తాజాగా మేకర్స్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 26, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ వాయిదా పడటంతో, ఆ ఖాళీ అయిన స్లాట్‌లోకి బాబాయ్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గబ్బర్ సింగ్‌లోని ‘కెవ్వు కేక’ లాంటి స్పెషల్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాలో ఉండదని హరీష్ శంకర్ వెల్లడించారు. అయితే, సినిమాలో ఉండే ప్రతి పాట ఒక ‘స్పెషల్ ఐటమ్’ లాగే ఉంటుందని, అభిమానులకు మ్యూజికల్ ట్రీట్ గ్యారెంటీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
