వైరల్ : ప్రజల్లో “బలగం” కి ఆగని ఆదరణ.!

Published on Apr 2, 2023 2:00 pm IST

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన పలు అద్భుతమైన విజయాల్లో రీసెంట్ సెన్సేషన్ చిత్రం “బలగం” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. మరి ఓ పర్ఫెక్ట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల రన్ కి దగ్గరకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా కేవలం 20 రోజుల్లోనే ఓటిటి లో వచ్చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఓటిటి రిలీజ్ బలగం సక్సెస్ ని థియేటర్స్ లో ఆపలేకపోయింది. అంతే కాకుండా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో బలగం ప్రదర్శనలు ప్రత్యేకంగా వేస్తూ ఉండడంతో ప్రజలు అమితంగా ఆదరిస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు. దీనితో అయితే నటుడు ప్రియదర్శి దర్శకుడు వేణు లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు. దీనితో వీరి ట్వీట్స్ బలగం తాలూకా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

సంబంధిత సమాచారం :