తగ్గేదేలే : “పుష్ప” రాజ్ సెన్సేషన్..16వ రోజు రికార్డు ఫిగర్ టచ్.!

Published on Jan 2, 2022 1:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” భారీ వసూళ్లను అందుకొని గత ఏడాదికి ఇండియాలోనే అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచింది. మరి బాలీవుడ్ మార్కెట్ లో అయితే పుష్ప రాజ్ సెన్సేషన్ మామూలుగా లేదని తెలుస్తుంది.

ఈ సినిమా అక్కడ రిలీజ్ అవ్వడం డీసెంట్ ఓపెనింగ్స్ నే అందుకున్నా తర్వాత నుంచి మాత్రం పుష్ప వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్ కి గురవుతున్నాయి. అంతకంతకు బెటర్ వసూళ్లతో కొనసాగుతూ ఏకంగా 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన పుష్ప ఇప్పుడు ఒక సాలిడ్ రికార్డు ని సెట్ చేసి పెట్టింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి 16వ రోజు ఏకంగా 6 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టి ఒక సరికొత్త రికార్డు ను సృష్టించింది. రెండు వారాల తర్వాత కూడా పుష్ప ఈ రేంజ్ లో వసూళ్లు అందుకుంటుండడం ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పడానికి నిదర్శనం.

అక్కడ పలు నోటెడ్ సినిమాలు ఉన్నా పుష్ప గట్టి నిలకడ కనబరచడం ఆశ్చర్యకరం. దీనితో ఈ సినిమా లాంగ్ రన్ లో 75 కోట్లు మేర రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా రష్మికా హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :