లేటెస్ట్ : జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల విధ్వంశం

లేటెస్ట్ : జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల విధ్వంశం

Published on Nov 28, 2022 7:42 PM IST


టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించి తమ అద్బుత నటనతో ప్రంపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిమానుల మనసు దోచారు. ఇక దర్శకడు రాజమౌళి మూవీని ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కించిన తీరుకి ఎందరో సినిమా ఆడియన్స్ తో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసింది యూనిట్.

అయితే విషయం ఏమిటంటే, తొలి రోజు నుండి జపాన్ లో దూసుకెళ్తున్న ఈ మూవీ తొలి రోజు కంటే నిన్నటి 38వ రోజున అత్యధికంగా కలెక్షన్ అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. దీనిని బట్టి ఆర్ఆర్ఆర్ రాబోయే అతి కొద్దిరోజుల్లోనే జపాన్ లో అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా గొప్ప రికార్డు అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు