“వీరమల్లు” ట్రీట్ లేనట్టే.?

Published on Jan 25, 2023 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరోకీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పవన్ కెరీర్ లో భారీ నెలకొల్పుకొని వస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ లో ఉంది. అయితే పవన్ ఇప్పుడు షూటింగ్ కి దూరంగా ఉండగా లేటెస్ట్ గా ఈ జనవరి 26 న అయితే సినిమా నుంచి సరికొత్త టీజర్ ఉంటుంది అని స్వయంగా నిర్మాతే చెప్పడం ఆసక్తిగా మారింది.

కానీ ఈ మాటకి ప్రోగ్రెస్ గా తర్వాత చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇక ఈ ట్రీట్ లేనట్టే అనుకోవాలి అనిపిస్తుంది. మరో బహుశా అట్లీస్ట్ ఈరోజైన ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలని కొందరు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ సినిమా కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :