“పుష్ప ది రూల్” ట్రీట్ లేనట్టేనా.?

“పుష్ప ది రూల్” ట్రీట్ లేనట్టేనా.?

Published on Dec 14, 2022 4:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చినటువంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప” కోసం తెలిసిందే. మరి ఏ చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో అయితే నెక్స్ట్ ఈ చిత్రం సీక్వెల్ “పుష్ప ది రూల్” పై నెక్స్ట్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూట్ నిన్ననే హైదరాబాద్ లో స్టార్ట్ కాగా ఈ చిత్రంపై అయితే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆసక్తిగా మారింది.

మరి గత కొన్నాళ్ల కితం వరకు అయితే పుష్ప 2 గ్లింప్స్ లాంటి దాన్ని ఇండియా వైడ్ అవతార్ 2 సినిమాతో అటాచ్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా గట్టి టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు షూట్ అయ్యితే డిలే అయ్యింది. మరి దీనితో అయితే పుష్ప ట్రీట్ అవతార్ 2 తో మిస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి. లేదా ఆల్రెడీ కేవలం గతంలోలా గ్లింప్స్ షూట్ ముందే కంప్లీట్ చేసి యాడ్ చేసారా అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు