పవన్ మూవీ లో సునీల్..వార్తల్లో నిజమెంత ?

sunil
గత కొన్ని రోజులుగా హీరో సునీల్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పవన్- త్రివిక్రమ్ ల చిత్రం లో ముఖ్య పాత్రలో సునీల్ కనిపించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ వార్త కేవలం రూమరే అని తేలిపోయింది.

కాగా ప్రస్తుతం సునీల్ తన చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పవన్ – త్రివిక్రమ్ ల మూవీ లో సునీల్ నటించడం లేదని ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. కాగా త్రివిక్రమ్ పవన్ తో చేయబోయో చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కనుంది. కాగా పవన్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.