SSMB28: ఆ వార్తల్లో నిజం లేదు!

SSMB28: ఆ వార్తల్లో నిజం లేదు!

Published on Oct 29, 2022 2:13 AM IST


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకు బ్రేక్ తీసుకొని, లండన్ లో ఉన్నారు సూపర్ స్టార్. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ లో మళ్లీ ప్రారంభం కానుంది.

గత కొన్ని రోజులుగా, మహేష్ స్క్రిప్ట్‌లో మార్పులు కోరడంతో, షూట్ ఆగిపోయింది మరియు త్రివిక్రమ్ తన టీమ్‌తో అదే పనిలో బిజీగా ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది, కొద్దిరోజుల క్రితం మహేష్ తల్లి హఠాన్మరణం చెందడంతో షూటింగ్ ఆగిపోయింది. మహేష్ లండన్‌లో తన కుటుంబం మరియు పిల్లలతో కొంత వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నాడు మరియు త్వరలో తిరిగి షూటింగ్‌ లో జాయిన్ కానున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు