“భీమ్లా నాయక్” పై టాక్ లో ఎలాంటి నిజం లేదా.?

Published on Jan 18, 2022 7:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “భీమ్లా నాయక్”. మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మరింత మాసివ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇలా మాస్ ఆడియెన్స్ లో మాత్రం మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని పూర్తి చేసేసే పనిలో మేకర్స్ ఉండగా ఇంకో పక్క ఈ సినిమా రిలీజ్ పై పలు ఆసక్తికర ఊహాగానాలే వినిపించడం స్టార్ట్ అయ్యాయి. అలా ఈ సినిమాని ఒక్క తెలుగులోనే కాకుండా మరిన్ని భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని ఓ టాక్ మొదలైంది.

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి మేకర్స్ సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ పైనే స్టిక్ అయ్యి ఉన్నారట. ఒకవేళ ఇంకా పరిస్థితులు మారితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు కోసం చేయొచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే ఈ టాక్ లో నిజం లేదనే తెలుస్తుంది. మరి వేచి చూడాలి భీమ్లా ఎలా రిలీజ్ అవుతుంది అనేది.

సంబంధిత సమాచారం :