“ఆచార్య” పై అప్డేట్ అప్పటి వరకు రాదా.?

Published on Jul 30, 2021 9:00 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే హై బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇపుడు ఈ చిత్రం లాస్ట్ స్టేజ్ షూటింగ్ లో ఉండగా మరో పక్క అభిమానులు ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అది కూడా చరణ్ మరియు పూజా హెగ్డేల మధ్య డిజైన్ చేసిన సాంగ్ అప్డేట్ కోసం ఎంతగానో చూస్తున్నారు. అయితే ఇదే కాకుండా ఏ అప్డేట్ కూడా చిత్రం షూట్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మేకర్స్ నుంచి రాదు అని తెలుస్తుంది.

ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ షూట్ పూర్తి ఏకాగ్రత పెట్టి దానిని పూర్తి చేసాక ఆ అప్డేట్స్ ఏవో వస్తాయని బజ్.. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :