ప్రాజెక్ట్ కే నుండి అప్డేట్ వచ్చే ఛాన్స్ లేనట్టేగా!

Published on Oct 12, 2021 6:42 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాలకు సంబందించిన అప్డేట్స్ రానున్నాయి. అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు ఉండటం తో పలు సినిమాల కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం వుంది. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇదే విషయాన్ని తాజాగా డైరక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

అయితే రాధే శ్యామ్ చిత్రం విడుదల తర్వాత ఈ చిత్రం అప్డేట్స్ రానున్నాయి. ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల అనంతరం, సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే లకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. రాధే శ్యామ్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :