ఆహా వీడియో లోకి రానా “నంబర్ వన్ యారి”

Published on Oct 3, 2021 11:20 pm IST

తెలుగు ప్రేక్షకులకి ఈ మధ్య కాలం లో ఎంతో దగ్గరైన ఓటిటి ప్లాట్ ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ఆహా వీడియో అని చెప్పాలి. సరికొత్త చిత్రాలను, కార్యక్రమాలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు ఎంతో వినోదాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు రానా దగ్గుపాటి వ్యాఖ్యాత గా వ్యవహరించిన నంబర్ వన్ యారీ ను ఆహా వీడియో సరికొత్తగా మన ముందుకు తీసుకు వస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ను ఆహా వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

ఆహా వీడియో లోకి నంబర్ వన్ యారి అంటూ ఒక వీడియో నీ షేర్ చేయడం జరిగింది. అందులో లవ్ స్టోరీ టీమ్ శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవి కి సంబంధించిన సన్నివేశాలను చూపించడం జరిగింది. నంబర్ వన్ యారీ ఆన్ ఆహా అంటూ చెప్పుకొచ్చింది. రానా దగ్గుపాటి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు ఇది మరింత వినోదం అందిస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :