బిగ్‌బాస్ 5: సింగర్ నోయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?

Published on Sep 25, 2021 12:15 am IST


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సింగర్‌, యాక్టర్‌ నోయల్‌ సేన్‌ గుర్తున్నాడా. ఆరోగ్యం సహకరించకపోవడంతో గత సీజన్‌లో షో నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు నోయల్. తాను షో నుంచి బయటికొచ్చాక దేత్తడి హారిక, లాస్యకు సపోర్ట్‌ చేసి వారికి అండగా నిలబడ్డాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐదో సీజన్‌లో కూడా నోయల్ ఓ కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేస్తున్నాడు.

సింగర్ శ్రీరామ్‌ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సింగర్ శ్రీరామచంద్రకు ఓటేయమని నోయల్ అభిమానులను కోరుతున్నాడు. అనధికారిక సమాచారం ప్రకారం శ్రీరామ్‌ ఈవారం ఈజీగా సేఫ్‌ అవుతాడని తెలుస్తుంది. అయితే ఈ వారం లేడీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అఫీషియల్‌ ఓటింగ్‌లో శ్రీరామ్‌ టాప్‌ 3లో ఉన్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :