బాలయ్యతో బాలీవుడ్ భామ.. క్యారెక్టర్ అదే !

బాలయ్యతో బాలీవుడ్ భామ.. క్యారెక్టర్ అదే !

Published on Mar 6, 2023 3:00 PM IST

నందమూరి బాలకృష్ణ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ భామ నోరా ఫతేహి ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఈ పాత్ర నెగిటివ్ గా ఉంటుందని, ఈ పాత్రకి నోరా ఫతేహి అయితేనే సరైన న్యాయం జరుగుతుందని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. మరి నోరా ఫతేహి – బాలయ్య కలయికలో ఏ రేంజ్ సీన్స్ ఉంటాయో చూడాలి. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ మూవీగా రాబోతుంది. పైగా ఈ సినిమాలో బాలయ్య పూర్తిగా తెలంగాణ మాండలికంలో డైలాగ్ లు చెప్పబోతున్నారు.

అలాగే బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని, ముఖ్యంగా 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ అదిరిపోతోందని టాక్ నడుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే.. ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి అరవై ఏళ్ల వయసులో విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు