పూరీ ‘లోఫర్‌’లో నోరా ఫతేహి స్పెషల్ అట్రాక్షన్!

Nora-Fatehi
నోరా ఫతేహి.. ‘టెంపర్’ సినిమాలోని ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ హాలీవుడ్ భామ, అతికొద్ది కాలంలో తెలుగు సినిమాల్లో హాట్ ఫేవరైట్‌గా మారిపోయింది. ‘టెంపర్’ తర్వాత ఆ వెంటనే ‘బాహుబలి’లో ఐటెమ్ సాంగ్, ‘కిక్ 2’లో మరో ఐటెమ్ సాంగ్.. ఇలా వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది నోరా ఫతేహి. తాజాగా ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే మరోసారి ఓ స్పెషల్ సాంగ్‌ ద్వారా కనువిందు చేయనుంది.

మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్యే హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్‌తో పూరీ లోఫర్ పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మీర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గత కొద్దిరోజుల క్రితమే జోధ్‌పూర్‌లో జరిగిన ఓ షెడ్యూల్‌లో నోరా ఫతేహి పాల్గొనగా ఓ స్పెషల్ చిత్రీకరించారట. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే మరోసారి నటించడం పట్ల నోరా ఫతేహి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోఫర్ సినిమాలో నోరాఫతేహి చేసిన సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని తెలుస్తోంది.

Exit mobile version