ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాదు.. ట్విస్ట్ ఇవ్వబోతున్న శివ కార్తికేయన్?

God-Of-War

గత కొన్ని రోజులు నుంచి మన తెలుగు సినిమా దగ్గర పాన్ ఇండియా స్టార్ హీరోస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల అభిమానులు మధ్య ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ పై ఎప్పటికప్పుడు రచ్చ నడుస్తూనే ఉంది. ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో భారీ చిత్రం ఆ మధ్య అనౌన్స్ అయ్యింది.

ఇప్పుడు వరకు ఇండియన్ సినిమా దగ్గర ఎవరూ టచ్ చెయ్యని కాన్సెప్ట్ ఇది అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ తర్వాత కాలం మారి మళ్ళీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరకి మారింది. మళ్ళీ ఎన్టీఆర్ మళ్ళీ అల్లు అర్జున్ ఇలా ఒక సరైన క్లారిటీ లేకుండా ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం వార్ జరుగుతూ ఉంటే మధ్యలోనే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ వచ్చాడు.

అయితే గాడ్ ఆఫ్ వార్ అనే ప్రాజెక్ట్ కార్తికేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కానీ తాజాగా శివ కార్తికేయన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన పోస్టర్ చూస్తే అదే కార్తికేయ స్వామితో లింక్ ఉండే సబ్జెక్టు లానే కనిపిస్తుంది. దీనితో ఈ కొత్త ట్విస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఆ మధ్య దర్శకుడు కిషోర్ తిరుమల కూడా తన దగ్గర కార్తికేయ స్వామి నేపథ్యంలోనే ఓ పవర్ఫుల్ సబ్జెక్టు ఉన్నట్టు తెలిపారు. కానీ ఇక్కడ శివ కార్తికేయన్ నుంచి దాదాపు అదే తరహా సబ్జెక్టు అనౌన్స్ అయినట్టు కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది రేపు వచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ తో కొంచెం క్లారిటీ రావచ్చు.

Exit mobile version