తన రాజకీయ అరంగేట్రం పై మళ్లీ క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్

Published on Aug 9, 2022 1:30 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా తన రాజకీయ అరంగేట్రం పై మళ్లీ క్లారిటీ ఇచ్చాడు. తానూ భవిష్యత్తులో కూడా పాలిటిక్స్‌లోకి వచ్చే ప్రసక్తే లేదని రజని స్పష్టం చేశాడు. తాజాగా తమిళనాడు గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చిన ఆయన మీడియాతో ఈ కామెంట్స్ చేశాడు. ఇక తనకు ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవు అని, తన రాజకీయ పార్టీ పై మొత్తానికి ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రజిని తాజాగా చెప్పిన ఈ మాటలకు మళ్ళీ ఫ్యాన్స్ బాగా నిరాశకి గురయ్యారు.

అయితే గతంలో రజనీ పార్టీ పెట్టేందుకు సిద్ధం కాగా.. అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి మళ్లీ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని పుకార్లు వినిపిస్తూనే వచ్చాయి. రజని కూడా తన రాజకీయ పార్టీ పై, తన రాజకీయ ఎంట్రీపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ రజినీ భవిష్యత్తులో అయినా రాజకీయాల్లోకి వస్తారని ఆయన ఫ్యాన్స్ కలలు కంటూనే ఉన్నారు. అయితే రజినీకాంత్ మాత్రం రాజకీయాల్లోకి రావట్లేదు అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :