ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువ టచ్ చేసిన జానర్ లలో ఒకటైన సూపర్ హీరో జానర్ నుంచి మన టాలీవుడ్ లో వచ్చిన మొదటి సినిమానే సూపర్ హిట్ అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలయికలో వచ్చిన హను మాన్ భారీ హిట్ కాగా ఆ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ని సిద్ధం చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు.
ఇక వీటిలో భాగంగా జై హనుమాన్, ఇంకా మహాకాళి వంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. కానీ అసలు వీటి అన్నిటికంటే ముందే అంటే ఎప్పుడో RRR కూడా రావడానికి ముందే అనౌన్స్ చేసిన భారీ సూపర్ హీరో చిత్రం ‘అధీర’ పరిస్థితి మాత్రం ఏమయ్యింది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతూ రివీల్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కే మంచి రెస్పాన్స్ వచ్చింది.
కానీ మళ్ళీ కొన్నాళ్ల పాటు ఆ సినిమా ఏమైందో కూడా తెలియరాలేదు. మళ్ళీ గత ఏడాది పవన్ ఓజి సినిమా విడుదల చేస్తున్న సమయంలో ఎస్ జే సూర్యని విలన్ గా చూపిస్తూ ఒక్క పోస్టర్ విడుదల చేశారు. ఇలా దీని తర్వాత అనౌన్స్ అయ్యిన సినిమాలే ఇప్పుడు పూర్తవుతూ, రిలీజ్ కి కూడా వస్తున్నాయి కానీ అధీర మాత్రం ఏమయ్యాడో అనేది ఇంకా క్లారిటీ లేదు. సో దీనిపై మేకర్స్ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
