లీక్ కానిది కాకుండా అబ్బురపరిచేలా “కల్కి 2898 ఎడి” స్పెషల్ ట్రైలర్..

లీక్ కానిది కాకుండా అబ్బురపరిచేలా “కల్కి 2898 ఎడి” స్పెషల్ ట్రైలర్..

Published on Jun 20, 2024 3:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పడుకోణ్ (Deepika Padukone) అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఒకో అంశంతో మరింత హైప్ ని పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం నిన్ననే ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకుంది.

అయితే ఈ ఈవెంట్ లో మేకర్స్ ఒక స్పెషల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు వరకు అఫీషియల్ గా వచ్చిన ట్రైలర్ కాకుండా స్క్రీన్ ట్రైలర్ అని తెలుస్తుంది. అలాగే అఫీషియల్ ట్రైలర్ లాంచ్ కి ముందు సరిగ్గా లీక్ అయ్యిన మరో ట్రైలర్ కూడా ఇది కాదు అని తెలుస్తుంది.

ఇది సుమారు నిమిషంన్నర నిడివితో కట్ చేశారు. అయితే ఈ వీడియో మొత్తం కూడా అబ్బురపరిచే యాక్షన్ విజువల్స్ తో కేవలం యాక్షన్ కట్ గా అయితే ప్లే చేసినట్టుగా తెలుస్తుంది. మరి అప్పుడు లీక్ అయ్యిన ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారో లేక ఈ స్పెషల్ కట్ ని రిలీజ్ చేస్తారో అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు