నోటా విడుదల తేదీ ఫై రేపు క్లారిటీ రానుంది !

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’ విడుదలపై కొనసాగుతున్న అనిచ్చితి రేపు తొలిగిపోనుంది. ఈసినిమా విడుదలపై రేపు అధికారకంగా ప్రకటన వెలుబడనుంది. ఈవిషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాత ద్వారా తెలియజేశారు. అంతే కాకుండా ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తే బాగుంటుందో చెప్పండి అంటూ ఓక పోల్ ను కూడా పెట్టారు. దానిలో ఎక్కువమంది అక్టోబర్ 5న విడుదలకు మొగ్గు చూపారు.

‘ఇరుముగన్ ‘ఫెమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్నఈచిత్రంలో మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈచిత్రం ఫై అంచనాలను పెంచేసింది.

Exit mobile version