వైరల్ : ఆలియా భట్ పై హాలీవుడ్ నటి ఇంట్రెస్టింగ్ రిప్లై.!

వైరల్ : ఆలియా భట్ పై హాలీవుడ్ నటి ఇంట్రెస్టింగ్ రిప్లై.!

Published on Dec 31, 2022 6:06 PM IST

హాలీవుడ్ సినిమా దగ్గర మార్వెల్ సినిమాల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి ఇపుడు మర్వెల్ లో ఫేజ్ 4 కొత్త సిరీస్ లు అయితే ఇప్పుడు వస్తుండగా ఇందులో పలు సిరీస్ లు అయితే భారీ రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. మరి ఈ సిరీస్ లలో అయితే “లోకి” సిరీస్ బాగా హిట్ కాగా ఈ సిరీస్ లో అయితే నటించిన ప్రముఖ హాలీవుడ్ నటి సోఫియా డి మార్టినో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ విషయంలో ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది.

ఈ ఏడాది బెస్ట్ కాస్టింగ్ లో ప్రశ్న రాగా ఈ హాలీవుడ్ నటి అయితే బాలీవుడ్ ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రం “గంగూబాయి ఖాతియవాడి” కి గాను తన ఎంపిక అయితే ఆలియా భట్ అంటూ రిప్లై ఇచ్చింది. దీనితో ఈ రిప్లై ఇపుడు సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో మంచి వైరల్ గా మారింది. దీనితో హాలీవుడ్ నటికి ఆలియా సినిమా ఫేవరెట్ కావడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించగా నటుడు అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రని చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు