లేటెస్ట్..వరుణ్ తేజ్ నెక్స్ట్ లో ప్రముఖ బ్యూటీ.!

Published on Mar 3, 2023 11:15 am IST

మెగా యంగ్ హీరోస్ లో అయితే ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో రావడంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడు. అలా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు అయితే తాను చేస్తుండగా వాటిలో తన కెరీర్ లో చేస్తున్న 13వ సినిమా కూడా ఒకటి. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా భారత వాయుదళ నేపథ్యంలో అయితే తెరకెక్కనుంది.

మరి ఈరోజు అయితే మేకర్స్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపించనున్నారు అనేది రివీల్ చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మరియు మిస్ యూనివర్స్ అయినటువంటి మానుషి చిల్లర్ నటించనున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిపై ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ మరియు రెనైస్సెన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :