“దేవర” తారక్ తో వర్క్ చేయడంపై ఎగ్జైట్ అవుతున్న ప్రముఖ టెక్నీషియన్

“దేవర” తారక్ తో వర్క్ చేయడంపై ఎగ్జైట్ అవుతున్న ప్రముఖ టెక్నీషియన్

Published on Jun 22, 2024 6:01 PM IST

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుండగా రీసెంట్ గానే మేకర్స్ ఓ సాంగ్ కూడా స్టార్ట్ చేసారని తెలిసింది.

అయితే ఈ సాంగ్ సాంగ్ విషయంలో దీనిని కంపోజ్ చేస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఫైనల్ గా అపారమైన టాలెంట్ కలిగిన ఎన్టీఆర్ గారితో తో వర్క్ చేయడం ఎంతో ఉత్సహంగా ఉందని తమ ఇద్దరి పిక్ కలిపి షేర్ చేసి తన ఫీలింగ్ ని వ్యక్త పరిచారు.

దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది. మరి కాంబినేషన్ లో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు