సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ మూవీని రిలీజ్ చేయనున్న ప్రముఖ సంస్థ

Published on Jan 7, 2023 9:10 pm IST

ఇటీవల కలర్ ఫోటో మూవీ ద్వారా నటుడిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న యువ నటుడు సుహాస్, లేటెస్ట్ గా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ మూవీలో ఆకట్టుకునే రోల్ లో నటించి మరొక్కసారి ఆడియన్స్ ని అలరించారు. ఇక ప్రస్తుతం సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మాతలుగా గ్రాండ్ లెవెల్లో రూపొందిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్, పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న రైటర్ పద్మభూషణ్ మూవీని ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ విజయవాడ నేపథ్యంలో సాగుతుంది. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియా తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని ఆకట్టుకునేలా హిలేరియస్ ఫామిలీ ఎంటర్టైనర్ గా దర్శకడు షణ్ముఖ ప్రశాంత్ అద్భుతంగా తెరకెక్కించారని అంటోంది యూనిట్. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులని ప్రముఖ సంస్థ గీత ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వారు దక్కించుకున్నారు. ఇటీవల తాము రిలీజ్ చేసిన కాంతారా పెద్ద సక్సెస్ అందుకుందని, ఆ విధంగానే మంచి కాన్సెప్ట్ తో రూపొందుతున్న రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా ఆడియన్స్ ని అలరిస్తుందనే నమ్మకాన్ని గీత ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ వారు అంటున్నారు.

సంబంధిత సమాచారం :