ప్రముఖ లేబుల్ కి “డబుల్ ఇస్మార్ట్” ఆడియో హక్కులు

ప్రముఖ లేబుల్ కి “డబుల్ ఇస్మార్ట్” ఆడియో హక్కులు

Published on May 12, 2024 3:15 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రం సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో వచ్చిన మొదటి సినిమాకి కూడా మణిశర్మ ఇచ్చిన పాటలు కానీ స్కోర్ కానీ ఎంత పెద్ద హైలైట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ కాంబో రిపీట్ కావడంతో దీనిపై కూడా గట్టి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ హక్కులు ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ లేబుల్ వారు సొంతం చేసుకున్నారు. దీనితో డబుల్ ఇస్మార్ట్ ఆడియోని ఆదిత్య మ్యూజిక్ లో ఎంజాయ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు