ఒకే సంస్థలో భారీ ధరకి “విక్రమ్” శాటిలైట్, డిజిటల్ హక్కులు.!

Published on May 5, 2022 9:00 am IST

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. తానే ఒక మహా నటుడు అనుకుంటే తనతో పటు మరో ఇద్దరు వెర్సిటైల్ నటులు ఫహద్ ఫాజిల్ మరియు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లను దర్శకుడు లోకేష్ కనగ రాజ్ కీలక పాత్రల్లో నటింపజేశాడు.

అయితే ఈ క్యాస్టింగ్ తోనే మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి గాను ఆ రెండు హక్కులని ఒకే సంస్థ అన్ని భాషల్లోని కొనుగోలు చేసేసిందట.

అటు డిజిటల్ మరియు టెలివిజన్ పై ఒకే అనుబంధ సంస్థ అయినటువంటి స్టార్ వారు ఏకంగా 125 కోట్లు భారీ ఆఫర్ తో ఈ డీల్ ని క్లోజ్ చేశారట. అంటే ఈ సినిమా స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అలాగే టెలివిజన్ పరంగా స్టార్ సంబంధ ఛానెల్స్ లో ప్రసారం కానుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకి అనిరుద్ సంగీతం అందివ్వగా జూన్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :