భారీ ధరతో షారుఖ్ “జవాన్”కి ఓటిటి పార్ట్నర్ లాక్..?

Published on Jun 26, 2022 12:00 pm IST


బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ఇప్పుడు పలు భారీ యాక్షన్ అండ్ మాస్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తో చేస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “జవాన్” కూడా ఒకటి. ఈ చిత్రం టైటిల్ అనౌన్సమెంట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకోగా..

ఇప్పుడు ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఓ టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధర ఇచ్చి అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. కరెక్ట్ ఫిగర్ అయితే తెలియలేదు కానీ హిందీ సినిమాల వరకు మాత్రం రికార్డు మొత్తంలోనే ఈ సినిమాకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :