ఇప్పుడు ఓంరౌత్ “ఆదిపురుష్” వండర్స్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Jul 23, 2022 10:01 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఆడియెన్స్ బాగా ఎదురు చూస్తున్న పలు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా సరికొత్త కోణంతో తెలుగు మరియు హిందీ భాషల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించాడు.

మరి ప్రస్తుతానికి అయితే ఇండియన్ సినిమా దగ్గర ఇదే భారీ విజువల్ సినిమాగా పరిగణించబడగా లేటెస్ట్ గా ఓంరౌత్ గత చిత్రం “తనాజీ” కి జాతీయ స్థాయి పురస్కారం రావడంతో తన వర్క్ పట్ల ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సుకత నెలకొంది. ఆదిపురుష్ తో మాత్రం డెఫినెట్ గా ఓంరౌత్ వండర్స్ క్రియేట్ చేస్తాడని వారు భావిస్తున్నారు.

మరి దీనితో పాటుగా అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ సహా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :