ఇప్పుడు “తునివు” డేట్ పై అందరిలో ఆసక్తి.!

ఇప్పుడు “తునివు” డేట్ పై అందరిలో ఆసక్తి.!

Published on Dec 1, 2022 12:52 PM IST

చాలా కాలం తర్వాత కోలీవుడ్ సినిమా దగ్గర భారీ బాక్సాఫీస్ క్లాష్ వచ్చే ఏడాది సంక్రాంతిలో ఫిక్స్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి అక్కడి స్టార్ హీరోలు దళపతి విజయ్ అలాగే హీరో అజిత్ కుమార్ లు హీరోలుగా నటించిన చిత్రాలు “వారిసు” అలాగే “తునివు” సంక్రాంతి బరికే అనౌన్స్ కావడంతో ఈ ఎపిక్ క్లాష్ సౌత్ ఇండియా సినిమా దగ్గర చాలా కేజ్రీగా మారింది.

అయితే గత కొన్ని రోజులు వరకు కూడా ఈ చిత్రాలు డేట్స్ రెండు కూడా బయటకి రాకుండా మేకర్స్ సస్పెన్స్ గానే ఉంచారు. మరి ఇప్పుడు అయితే విజయ్ సినిమా జనవరి 12 కి డేట్ లాక్ చేసుకోగా నెక్స్ట్ అయితే ఇప్పుడు అందరూ అజిత్ సినిమా వైపు చూస్తున్నారు. రీసెంట్ గా అయితే రెండు సినిమాలు ఒకేరోజు వచ్చే ఛాన్స్ ఉందని బజ్ రాగా ఇప్పుడు తునివు డేట్ తో అయితే ఇది క్లారిఫై కానుంది. మరి ఈ చిత్రం ఓరోజు ముందు వస్తుందా వెనుక వస్తుందా లేక ఒకేరోజు వస్తుందా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు