దుమ్ము రేపే సన్నివేశాల్లో “పుష్ప” రాజ్!


ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలయిన సంగతి అందరికీ తెలిసిందే.

స్వయంగా చిత్ర యూనిటే సినిమా షూట్ ను ఆరంభించినట్టుగా తెలిపారు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ చిత్రం షూటింగ్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో స్టార్ట్ కానుంది అని తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూనే సుకుమార్ అండ్ టీం బన్నీతో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు.

అలాగే ఈ సీన్ స్టంట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ మరియు పీటర్ హైన్స్ సహా పలువురు హాలీవుడ్ టెక్నిషియన్స్ సమక్షంలో జరుగుతుంది. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version