క్రేజీ..”చెన్నకేశవ రెడ్డి” తో ఇక బాలయ్య వంతు.!

Published on Sep 20, 2022 10:00 am IST

మాస్ ఆడియెన్స్ లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే అప్పట్లో ఉండే మాస్ ఇంకో లెవెల్లో ఉండేది మరి అలా బాలయ్య నటించిన పలు మాస్ చిత్రాల్లో దర్శకుడు వివి వినాయక్ కాంబోలో చేసిన చెన్నకేశవ రెడ్డి సినిమా అయితే ఇప్పటికీ కూడా ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పాలి.

అప్పట్లో ఫలితంతో సంబందం లేకుండా ఈ సినిమా అప్పట్లో నమోదు చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టింగ్ అని చెప్పాలి. అలాంటి ఈ సినిమాతో ఇప్పుడు బాలయ్య మళ్ళీ థియేటర్స్ లో పలకరించేందుకు సిద్ధం అయ్యరు.

రీసెంట్ గా టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా యూఎస్ లో ఉన్న బాలయ్య అభిమానులు 30 కి పైగా స్పెషల్ షోలు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారట. దీనితో ఇప్పుడు ఈ టాక్ చర్చగా మారింది. ఇక మన దగ్గర కూడా భారీ లెవెల్లోనే ఈ షో లు ఉండొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :