ఇక అందరి కళ్ళు “పుష్ప” రిలీజ్ పైనే పడ్డాయ్.!

Published on Dec 2, 2021 6:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ మైండ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న బిగ్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. కరోనా పరిస్థితులు రీత్యా టాలీవుడ్ నుంచి బడా చిత్రాలు తక్కువే వచ్చాయి.

ఇక ఈరోజు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అఖండ” రిలీజ్ అయ్యి మొదటి షో నుంచి అదిరే రెస్పాన్స్ ని ఆల్ ఓవర్ గా అందుకుంది. ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.

దీనితో రాబోతున్న మరో బిగ్ సినిమా “పుష్ప” పైనే అందరి కళ్ళు పడ్డాయి. ఈ సినిమా అవుట్ పుట్ పరంగా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా సుకుమార్ టేకింగ్ పాన్ ఇండియన్ సినిమాని డెఫినెట్ గా షేక్ చేస్తుందని ఇన్ సైడ్ టాక్. మరి పుష్ప రాజ్ ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :