ఇప్పుడు “భీమ్లా” పై ఒక్కసారిగా లేచిన భారీ అంచనాలు.!

Published on Feb 24, 2022 7:02 am IST

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రమే “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం ఎప్పుడు నుంచో భారీ అంచనాలు నెలకొల్పుకొని వస్తుంది అని అందరికీ తెలిసిందే. అయితే వాస్తవంగా చెప్పుకోవాలి అంటే..

ఈ సినిమాపై అంచనాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత పీక్స్ లోకి వెళ్లిపోయాయి. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాత్రం ఆ అంచనాలకు తగ్గట్లుగా లేదే.. అనే మాట కూడా అధికంగా వినిపించింది. అయితే సంగీత దర్శకుడు థమన్ కొత్తగా ట్రై చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముందు మాస్ దగ్గర నిలబడకపోవడంతో కాస్త డల్ గానే అనిపించింది.

కానీ నిన్న రిలీజ్ చేసినటువంటి రెండో ట్రైలర్ తో మాత్రం అందరి సందేహాలకు సమాధానం దొరికేసింది అని చెప్పాలి. కంప్లీట్ మాస్ మీల్స్ తో ఉన్న ఈ కొత్త ట్రైలర్ చూసాక మాత్రం ఇప్పుడు భీమ్లా నాయక్ పై భారీ స్థాయిలో అంచనాలు ఒక్కసారిగా లేచాయి. దీనితో ఆడియెన్స్ లో మరోసారి ఆసక్తి చెలరేగింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో మాస్ బుకింగ్స్ ని ఈ చిత్తం జరుపుకుంటుంది. మరి చూడాలి నాయక్ ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటాడో అనేది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :