ఇక “RRR” వంతు వచ్చింది..బిగ్ డే ఫిక్స్ అయ్యిందా.?

Published on Oct 26, 2021 10:00 am IST

పాన్ ఇండియన్ వైడ్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. భారీ లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి రిలీజ్ కి ఫిక్స్ కావడంతో ఇక అప్డేట్స్ కూడా షురూ అవుతున్నాయి.

అలా సినిమా నుంచి బిగ్ అప్డేట్ కి బిగ్ డే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం నుంచి అన్ని భాషలకి కలిపి ఒక సాలిడ్ టీజర్ కట్ ని చిత్ర యూనిట్ ఈ కొద్ది రోజుల్లో ఆ బిగ్ డే ఫిక్స్ చేసి రిలీజ్ చెయ్యడం ఫిక్స్ అన్నట్టు నయా ఇన్ఫో. మరి బహుశా అది ఈ వారంలో ఉండొచ్చని కూడా బజ్ ఉంది. ఇంకా చిత్రం హ్యాండిల్ నుంచి అయితే ఎలాంటి మూమెంట్ లేదు కానీ ఇక మళ్ళీ ఈ ప్రమోషన్స్ ని షురూ చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :