ఇక మహేష్ ఫ్యాన్స్ వంతు..!

Published on Jan 1, 2023 8:35 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాల హవా ఎలా నడుస్తుందో మనం చూస్తున్నాము. మన టాలీవుడ్ స్టార్ హీరోలు వారి అభిమానులు ఇప్పుడు రీ రిలీజ్ కి చేస్తున్న హంగామా కానీ వాటి వసూళ్లు కానీ కొత్త సినిమాలని తలపించేలా కనిపిస్తున్నాయి. ఇక ఇలా ఓ ప్రింట్ ని అప్డేట్ చేసి రిలీజ్ చేయడం అనే ట్రెండ్ ని అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులే అని చెప్పాలి.

మరి పోకిరి నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ కాగా ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే ఇప్పుడు “ఒక్కడు” దగ్గరకి వచ్చింది. ఆల్రెడీ పోకిరి తో సెన్సేషన్ ని రేపిన మహేష్ ఫ్యాన్స్ నెక్స్ట్ అయితే పవన్ ఫ్యాన్స్ జల్సా లేటెస్ట్ గా ఖుషి సినిమా తో రికార్డ్స్ సెట్ చేశారు. ఇక ఈ జనవరిలో మహేష్ ఒక్కడు రాబోతుండగా మహేష్ ఫ్యాన్స్ వంతు ఇప్పుడు వచ్చింది. దీనితో వీరు టేకోవర్ చేయనున్నారు బాక్సాఫీస్ ని. కాగా ఈ సినిమాతో అయితే ఎలాంటి నంబర్స్ మహేష్ ఫ్యాన్స్ సెట్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :