మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఆవేదన..?

మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఆవేదన..?

Published on Dec 10, 2022 7:02 AM IST

ప్రస్తుతం రోజుల్లో ఓటిటి రాకతో అయితే ఆల్ మోస్ట్ అన్ని భాషల్లో కంటెంట్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. దీనితో ఏదన్నా రీమేక్ అనౌన్స్ చేసినా కూడా అవి ఆల్రెడీ చాలా మంది చూసేసిందే ఉంటుంది. అయితే ఒకవేళ చేసినప్పటికీ ఆ హీరో స్టార్ పవర్ తో ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ ఈ రీమేక్ లతో అల్టిమేట్ గా అభిమానుల్లో నిరాశ తప్ప మరొకటి కనిపించడం లేదు.

ఒకప్పుడు రీమేక్ సినిమాలు అంటే చాలా తక్కువమందికి ఒరిజనల్ సినిమా రీచ్ ఉండేది కాబట్టి తెలుగులో తీసినా అవి మంచి వసూళ్లు రాబట్టేవి.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు అయినా కూడా అందులోని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ లాంటి హీరోలు రీమేక్ లు అనౌన్స్ చేస్తూ ఉండడం పైగా వాటిని తెలుగులో ఎన్నో సార్లు చూసేసినవే చేస్తుండడం వారికి మింగుడు పడడం లేదు.

దీనితో నిన్ననే పవన్ ఫ్యాన్స్ తేరి రీమేక్ విషయంలో సోషల్ మీడియా ని షేక్ చెయ్యగా ఇప్పుడు అయితే మెగా ఫ్యాన్స్ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రీమేక్ సినిమాలు వద్దని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి ఇది అయితే వారి వరకు వెళ్తుందో లేదో కానీ రానున్న రోజుల్లో అయితే రీమేక్ సినిమాలపై మాత్రం జెనరల్ ఆడియెన్స్ లో కూడా మరింత ఆసక్తి తగ్గే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు