అప్పుడే “పుష్ప 2” లీక్స్ కూడా.?

Published on Jan 27, 2023 10:36 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ మేకర్స్ రీసెంట్ గానే రెగ్యులర్ ట్రాక్ లోకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకి ముందు భాగం పుష్ప ది రైజ్ షూటింగ్ సమయంలో మొదటి నుంచి కూడా ఎన్నో లీక్స్ బయటకి వచ్చేసాయి.

కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలు కానీ కొన్ని సార్లు వీడియోలు కూడా వచ్చేసాయి. ఇక ఇప్పుడు కూడా గత సినిమా లానే సినిమా ఇలా మొదలైందో లేదో అప్పుడే పుష్ప 2 లీక్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆశ్చర్యకరంగా వీటిని అభిమానులే షేర్ చేసుకుంటున్నారు. మరి వీటిపై మేకర్స్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి. గతంలో ఇలా లీక్స్ ఎక్కువ అయ్యిన సమయంలో కాస్త సీరియస్ గానే నిర్మాతలు స్పందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :