ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న “రంగస్థలం” పేరు..!

Published on Jan 18, 2022 8:03 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే గేమ్ ఛేంజింగ్ సినిమాలు ఏవన్నా ఉన్నాయి అంటే అప్పుడు “మగధీర” ఆ తర్వాత “రంగస్థలం” సినిమాలే అని చెప్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. మరి రామ్ చరణ్ లోని పరిపూర్ణ నటుడిని బయటకి తీసుకొచ్చిన సినిమాగా అయితే “రంగస్థలం” తన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది.

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఒక్క వారి కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా నుంచి ఒక బెస్ట్ సినిమాగా కూడా నిలిచింది. మరి ఇదిలా ఉండగా ఇపుడు మళ్ళీ ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇదెందుకంటే ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్స్ చేస్తున్నారట.

ఈ సౌండింగ్ తో ఇప్పుడు క్రేజీ బజ్ నెలకొంది. అక్కడ ఈ సినిమా కూడా తప్పకుండా మంచి హిట్ అవుతుందని అభిమానులు సహా సినీ వర్గాలు వారు ఆశిస్తున్నారు. మరి ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి దీనిపై ఒక అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :