“భీమ్లా” రిలీజ్ పై ఓ రేంజ్ లో ఉన్న హైప్..కానీ..!

Published on Feb 9, 2022 10:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో తన సినిమాలకు మరింత స్థాయిలో క్రేజ్ ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తాను నటించిన లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ చిత్రం “భీమ్లా నాయక్” చూపిస్తుంది. అవ్వడానికి రీమేక్ అయ్యినా కూడా పవన్ మాస్ యుఫోరియా ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంకో లెవెల్లో నిలబెట్టింది.

ఈ రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ పట్ల సోషల్ మీడియాలో నెలకొన్న హైప్ అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది అని చెప్పాలి. దాదాపు ఈ నెలలోనే రిలీజ్ ఉంటుంది అని వార్తలు వినిపిస్తుండడంతో భీమ్లా నాయక్ పై హైప్ ఇప్పుడు వేరే లెవెల్ కి చేరుకుంది.

అయితే ఇదంతా బాగానే ఉన్నా ఈ చిత్రం విడుదల మాత్రం పరిస్థితులు థియేటర్స్ లో బాగా ఉన్నప్పుడే వస్తుందని అంతా గుర్తుంచుకోవాలి. టికెట్ ధరల ఇష్యూ ఇంకా సెటిల్ కాలేదు అలాగే ఏపీలో థియేటర్స్ కి 100 శాతం అక్యుపెన్సీ అనుమతులు రావాల్సి ఉంది. ఇవి సెటిల్ అయితేనే భీమ్లా నాయక్ డెఫినెట్ గా ఈ నెలలో రిలీజ్ అవ్వనుంది. మరి అభిమానులు అయితే దీనికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి.

సంబంధిత సమాచారం :