విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా “వారిసు”.?

Published on Feb 15, 2023 2:00 pm IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వారిసు”. మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విజయ్ కెరీర్ లో మంచి వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. ఇక ఈ సినిమా అయితే రీసెంట్ గానే వరల్డ్ వైడ్ 300 కోట్ల భారీ గ్రాస్ మార్క్ ని టచ్ చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరి ఇప్పుడు ఈ సినిమా అయితే విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచినట్టు తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. విజయ్ తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా ఇది వరకు “బిగిల్” సినిమా ఉండగా ఇప్పుడు దానిని వారిసు క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :