ఇక “విరూపాక్ష” టైం షురూ.!

Published on Apr 1, 2023 1:00 pm IST

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమా “దసరా” కోసం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అయితే రాబోతున్న మరో పాన్ ఇండియా సినిమానే “విరూపాక్ష”. మెగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుప్రీమ్ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ లేటెస్ట్ సినిమా తన కెరీర్ లో మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాగా అంచనాలు ఉన్నాయి.

ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ తో దర్శకుడు కార్తీక్ దండు మంచి ఆసక్తిని రేపగలిగాడు. మరి ఇప్పుడు సమయం దగ్గర పడుతుండడంతో అయితే మేకర్స్ విరూపాక్ష నెల లోకి అడుగు పెట్టినట్టుగా తెలిపారు. దీనితో ఈరోజు ఏప్రిల్ 1 తో అయితే రిలీజ్ డేట్ ఏప్రిల్ 21 వరకు ప్రమోషన్స్ ఉంటాయని తెలిపారు. మరి దసరా కి అయితే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ చూసాం ఇక ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాకి అయితే కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా బి వి ఎస్ ఎన్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :