‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక’ కృష్ణ జిల్లా వసూళ్ల వివరాలు !
Published on Aug 22, 2017 6:17 pm IST


ఈ నెల 11న విడుదలైన చిత్రాల్లో ‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక’ లు బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. వసూళ్లకు కీలకమైన కృష్ణా జిల్లా విషయానికొస్తే అక్కడ జయ జానకి నాయక చిత్రం మాస్ ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. నిన్న 11వ రోజు 3.37 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా ఇప్పటి వరకు 1. 4 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక రానా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ బోయపాటి సినిమాకంటే కూడా మంచి పెర్ఫార్క్మెన్స్ చూపిస్తోంది. ముందుగా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా 11వ రోజు 2. 01 లక్షల షేర్ ను రాబట్టి మోతంగా 1.37 కోట్లు రాబట్టుకుని మంచి లాభాల్ని చూపిస్తోంది. ఇక వరుణ్ తేజ్ చిత్రం ‘ఫిదా’ అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచి 32వ రోజు కూడా 80 వేల పై చిలుకు రాబట్టి టోటల్ గా 2.08 కోట్ల షేర్ ను నమోదు చేసింది.

 
Like us on Facebook