‘నేనే రాజు నేనే మంత్రి’ లేటెస్ట్ కలెక్షన్స్ !


దర్శకుడు తేజ చాన్నాళ్ల తర్వాత తన అభిరుచి ప్రేక్షకులకు మరోసారి తెలిసేలా చేసిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ లవ్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్ ఆగష్టు 11న విడుదలై మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మంచి వసూళ్లను సాదిస్తోంది. చాలా చోట్ల సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలను కళ్ళ చూస్తున్నారు.

తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జరిగిన 17 రోజుల్లో ఎపి, తెలంగాణల్లో అత్యధికంగా రూ.20.46 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం కర్ణాటకలో రూ.1.68 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ. 50 లక్షలు, ఓవర్సీస్లో రూ.1. 8 కోట్లు కలిపి మొత్తంగా రూ. 24.45 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దీంతో సోలో హీరోగా రానా కెరీర్లో ఇదే పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది.