అడ్వాన్స్ బుకింగ్స్ లో ముందంజంలో ఉన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ !

10th, August 2017 - 09:17:53 AM


రేపు శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రసవత్తరమైన పోటీ జరగనుంది. మూడు సినిమాలు ‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై’ మూడు ఒకేసారి విడుదలవుతున్నాయి. దాదాపు ఒకే స్థాయి కలిగినవి కావడం, మూడింటిపైనా పాజిటివ్ బజ్ ఉండటంతో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చెప్పడం కష్టంగా మారింది.

అంతేగాక చిత్ర యూనిట్లు ఎవరికి వారు పోటీపడి ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే ఇందులో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం మాత్రం కాస్త ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. రానా ఎగ్రెస్సివ్ గా, సరికొత్త తరహాలో పాటిస్తున్న పద్ధతులే ఇందుకు కారణం. దీంతో సినిమా బాగా ప్రాచుర్యం పొంది అడ్వాన్స్ బుకింగ్స్ లో ముందంజలో ఉంది. దీని తరవాత నితిన్ ‘లై’ రెండవ స్థానంలోనూ, బోయపాటి శ్రీను ‘జయ జానకి నాయక’ మూడవ స్థానంలోనూ ఉన్నాయి.